మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గారపాటి సాంబశివరావు అనారోగ్యంతో మరణించారు. ఆయన వయసు 75 ఏళ్ళు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వున్న సాంబశివరావు ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో వున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో…