బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషంగా ఉన్న చిత్రబృందం ఆనందాన్ని ఆవిరి చేస్తూ గంగూబాయి తనయుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి…