బాలిక గ్యాంగ్ రేప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరేడ్ మెట్ కి చెందిన యువకుడు విజయ్ కుమార్ కాచిగూడకి చెందిన మైనర్ బాలికను ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్ కుమార్ కి కాచిగూడ కి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.
నిర్భయ వంటి చట్టాలు ఎన్ని ఉన్నా.. ఎన్ కౌంటర్ లు ఎన్ని జరుగుతున్నా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు క్రమంగా పెరుగుతున్నాయి.