రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.