Haiti: కరేబియన్ ప్రాంతంలో అత్యంత పేదదేశంగా ఉన్న హైతీ ప్రస్తుతం ప్రమాదం అంచున ఉంది. ఆ దేశంలో ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పొంచిఉంది. జిమ్మి చెరిజియర్, ‘‘బార్బెక్యూ’’గా పిలువబడే క్రూరమైన గ్యాంగ్ లీడర్, ఇటీవల 3700 మంది ఖైదీలను విడిపించడంతో ఒక్కసారిగా ఆ దేశం ఉలిక్కిపడింది. ఆ దేశ అధినేత కెన్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో హైతీ దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.