వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ…