KCR Birthday: నేడు 71వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న కేసీఆర్కు పెద్దెతున్న రాజకీయ నాయకులు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు సోషల్ మీడియా వేదికాగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. Read Also: Fake Certificate: వ్యవసాయ శాఖలో…
గజ్వేల్ లో దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 127 మంది వేసిన నామినేషన్లలో 13 నామినేషన్లను ఆర్వో అధికారులు తిరస్కరించారు. ఇక, గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 114 మంది అభ్యర్థులు ఉండనున్నారు.
తాను గజ్వేల్ వస్తున్నా అని తెలవగానే కేసీఆర్ కామారెడ్డి పోయారని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక (మం) దుద్దెడలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తన భార్య అన్నీ అమ్ముకుందాం, అవసరం అయితే మళ్ళీ కొంగు నడుంకి కట్టి పనిచేస్తా.. నువ్వు మాత్రం కేసీఆర్ మీద కొట్లాట ఆపవద్దు అని చెప్పిందని ఈటల తెలిపారు.
రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి.