(జూన్ 20తో ‘గడసరి అత్త -సొగసరి కోడలు’కు 40 ఏళ్ళు) బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ‘గడసరి అత్త’గా, శ్రీదేవి ‘సొగసరి కోడలు’గా నటించిన చిత్రంలో కృష్ణ కథానాయకుడు. అంతకు ముందు కృష్ణతో ‘వియ్యాలవారి కయ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కట్టా సుబ్బారావు ఈ ‘గడసరి అత్త-సొగసరి కోడలు’ రూపొందించారు. 1981 జూన్ 20న విడుదలైన ఈ చిత్రం జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే – భర్తను బలవంతపెట్టి, ఆస్తి…