బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘G2’ 2026 మే 1న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అడివి శేష్ హీరోగా మరో సరికొత్త మిషన్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి గ్రాండ్ లెవెల్ పోస్టర్స్‌తో రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేశారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు.…