Farmer Got Diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్ట దేవత వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం లభించింది. జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న పొలంలో టమోటా పంటను పండించాడు. ఈ సందర్భంగా చేనులో కలుపు తీసే పనులు చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది. ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రం అని స్పష్టమైంది. సదరు వజ్రం 10 క్యారెట్లు ఉన్నట్లు రైతు నిర్ధారణ చేసుకున్నాడు.…