Special Story on RATAN TATA: నమ్మకంతో కూడిన నాయకత్వం.. టాటా గ్రూపు నినాదం. ఈ నమ్మకానికి నైతిక విలువలను జోడించారు రతన్ టాటా. 1868లో అంటే 154 ఏళ్ల కిందట ఒక ‘స్టార్టప్’గా ప్రస్థానం ప్రారంభించిన టాటా గ్రూపు ఇప్పుడు గ్లోబల్ కంపెనీల్లో ఒకటిగా ఊహించని స్థాయికి ఎదిగింది. దీని వెనక సంస్థ వ్యవస్థాకుడు జెమ్ షెట్ జీ టాటా కృషి ఎంత ఉందో ఆయన మునిమనవడు రతన్ టాటా పట్టుదలా అంతే ఉంది.