దేశంలో దీపావళి ముగిసింది. కానీ జార్ఖండ్‌లో మాత్రం పొలిటికల్ టపాసులు పేలుతున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమవారం ప్రధాని మోడీ.. హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై విరుచుకుపడగా.. మంగళవారం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.