జపాన్ ప్రధాన మంత్రి పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేశారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో విభజన జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చర్య తీసుకున్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో జపాన్ పాలక సంకీర్ణ ప్రభుత్వం ఎగువ సభలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పార్టీలో నాయకత్వ మార్పు కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎగువ సభ ఎన్నికల ఫలితాలు ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా అధికారంపై పట్టును మరింత బలహీనపరిచాయి.