గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో ఏపీలో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో వుంది. రిజర్వాయర్ కి సంబంధించిన ఆరు గేట్లును ఎత్తి 36,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం పూర్తి నీటి మట్టం 78 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటిమట్టం 76.639 టీఎంసీలకు చేరుకుంది. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు ఇరిగేషన్ అధికారులు. ఇదిలా వుండగా…
భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని ఊర్లన్నీ చెరువుల్లా మారాయి. తిరుపతిలో గ్రామాల మధ్య వివాదంగా మారింది రాయలచెరువు. గండి కొట్టాలని ఒకవైపు గ్రామస్థులు….గండి కొట్టకూడదని మరో వైపు గ్రామస్థులు అంటున్నారు. చెరువుకు అవుట్ ప్లో కంటే ఇన్ ప్లో ఎక్కువగా వుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. రాయల్ చెరువు నిండిపోవడంతో 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి, తమను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు వున్న మొరవ ఆక్రమణకు గురి కావడంతో…