మందు తాగుదామని చెప్పి మత్తులోకి చేరుకున్నాక స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎర్రకుంటకు చెందిన అబ్దుల్ ఫతేలి ఆటోడ్రైవర్ (32) వృత్తి రిత్యా ఆటోడ్రైవర్. పాతబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ జహంగీర్ లు స్నేహితులు. వీరిద్దరు తరచు మద్యం సేవిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే అబ్దుల్ ఫతేలికి మద్యం తాగుతామని చెప్పి జహంగీర్ మద్యంతో పాటు ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకుని బాలాపూర్ బారామల్గి వెనుక వైపుకు వచ్చాడు.…