ఉద్యోగం లేఖ ఖాళీగా ఉన్నారా.. సాఫ్ట్ వేర్ కోచింగ్ తీసుకుని జాబ్ కోసం వేచి చూస్తున్నారా.. అయితే మీకు సువర్ణావకాశం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సీనియర్లకు కాకుండా.. ఫ్రెషర్లకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించబోతుంది. టీసీఎస్ సీవోవో ఎన్. గణపతి సుబ్రమణియన్ తాము క్యాంపస్ నుంచి పెద్ద సంఖ్యలో నియామకాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్టు టీసీఎస్ పేర్కొంది.
బీటెక్ చదువుతున్న వారు రోజు రోజుకు ఎక్కువైయ్యారు.. దాంతో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌గా జాయిన్ అయ్యేందుకు వెతుకుతున్నారు.. ఆయా కంపెనీలు సైతం ప్రతి ఏడాది లక్షల మందిని నియమించుకుంటున్నారు.. అయితే ప్రతి ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇంటర్వ్యూ లో పలు…
ఏపీలో నిరుద్యోగులకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించినట్లు హెచ్‌సీఎల్ వెల్లడించింది. ఈ మేరకు వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందుకోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. పదో తరగతి పాసైన వారికి, ఇంటర్ పూర్తి చేసుకున్న వారికి ‘టెక్ బీ’ కార్యక్రమం కింద కెరీర్ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్‌సీఎల్ చెప్పింది. ఎంపికైన వారికి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి…