తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…