36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆఫ్‌సెట్ బాధ్యతలను ఆలస్యం చేసినందుకు గాను ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్‌పై భారత ప్రభుత్వం జరిమానా విధించింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం యూరో 7.8 బిలియన్ల ఒప్పందంలో ఆఫ్‌సెట్ హామీలను నెరవేర్చడంలో జాప్యం చేసినందుకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఫ్రెంచ్-భారత ప్రభుత్వాలు సెప్టెంబరు 2016లో యూరో 7.8 బిలియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, కాంట్రాక్ట్ విలువలో 50…