Global Economic Downturn: అనుకున్నట్లే అయింది. మాంద్యం మొదలైంది. అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం తన ప్రభావం చూపుతోంది. ఆ సూచనలు భారతదేశ వాణిజ్య రంగంపై అప్పుడే స్పష్టంగా తెలిసిపోతున్నాయి. 2022 డిసెంబర్ నెలలో ఇండియా సరుకుల ఎగుమతులు 12 శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా ఈ లావాదేవీల విలువ 34 పాయింట్ 5 బిలియన్ డాలర్లకే పరిమితం కావాల్సి వచ్చింది.