అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం నాడు తన నివాసంలో ఫ్రీడమ్ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు ఆగస్టు 15 కాదు.. జనవరి 26 కాదు. మరి ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకున్నారో ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఇసుక వివాదం నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. దీంతో అప్పట్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.…