Fraud: ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచాడు ఓ కేటుగాడు.. సుమారు 360 మంది నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టి మోసగించాడు ఇచ్చాపురంకు చెందిన ఏజెంట్ కొచ్చెర్ల ధర్మా రెడ్డి. అయితే, ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి.. సుమారు 6 కోట్ల రూపాయలతో విదేశాలకు జంప్ అయ్యాడు కేటుగాడు ధర్మారెడ్డి.