KTR : తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.