ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు…
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కమలా నెహ్రూ ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు మరణించారు. ప్రమాదం జరిగిన పిల్లల వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా.. మిగతా 36 మంది క్షేమంగా ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 12 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న పిల్లల బంధువులు వార్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో…