రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ జరగనుంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. రేపటితో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగియనున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ కోర్టును మరోసారి కోరనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ సమాధానమిచ్చారు.