మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ఖరారు చేసినప్పటికీ ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే అన్నారు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.