అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని దక్షిణ కాలిఫోర్నియా ఆస్పత్రిలో చేర్పించారు. రక్త సంబంధ ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో పాటు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది క్లింటన్‌కు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని అన్నారు. మూడు రోజుల క్రితమే క్లింటన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర…