ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆలోచన అని 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అంశంపై ఏర్పాటైన కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ శనివారం అన్నారు. కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) హస్పటల్ లో జాయిన్ అయ్యారు. పుణెలోని భారతీ హాస్పిటల్‌లో బుధవారం నాడు రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ రచించిన 'ప్రణబ్ మై ఫాదర్ ఎ డాటర్ రిమెంబర్స్' పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.