అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ నూతన ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ను ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్ ఆహ్వానించారు.
ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త పరిస్థితుల నెలకొన్నాయి. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందన్నారు. పోలీస్ రాజ్యం ఉందని చెప్పడానికే ఈ ఉదాహరణ…