ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అయితే, తనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టం అంటున్నారు ప్రకాష్ జైన్.. కానీ, ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేశానని వెల్లడించారు.