పోలవరం నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్రమంత్రికి జగన్ చెప్పించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని, దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని, జరిగిన పనులు…