ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్లో ఘటన జరిగింది. ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రయివేట్ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల అసలు, వడ్డీ కలిపి రిజ్వాన్ అప్పు తీర్చాడు.. కానీ చక్రవడ్డి ఇవ్వలేదని రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి మాజీ హోంగార్డ్ ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది.