హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే బాలకృష్ణ కేస్ లో బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందించారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు.