ఎయిరిండియా విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. 2016 నుంచి 2021వరకు విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా సేవలందించిన విషయం తెలిసిందే. 242 మందితో ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.