ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.
అవిశ్వాస తీర్మానంపై పోరాటం చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులతో కలసి ముగ్గురు దొంగలు పనిచేస్తున్నారని మండిపడ్డారు.. కొన్ని విదేశాల నుంచి మాకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.. విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే.. దేశం లోపల వారికి సహకరించే శత్రువులు కూడా ఉన్నారని, ఇద్దరు కీలక మిత్రపక్షాలు ఫిరాయించిన తర్వాత…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం కొత్తగా సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) లైసెన్సుకు రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దీంతో టీటీడీ దరఖాస్తును కేంద్రం తిరస్కరించింది. ఈ కారణంగా టీటీడీకి వచ్చే విరాళాలు భారీ మొత్తంలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాల రూపంలో ఒక్క రూపాయి కూడా అందలేదు. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా…
అమెరికా, బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ పీక్స్‌కు చేరుతున్నాయి. అగ్రరాజ్యంలో ఒక్కరోజే నమోదైన కొత్త కేసులు 2 లక్షల మార్క్‌ను దాటేయగా… బ్రిటన్‌లో వరుసగా రెండోరోజూ లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ లేటెస్ట్ వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉండొచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు… నిపుణులు. అమెరికాలో 24 గంటల్లో 2 లక్షల 65 వేల 32 మందికి కొవిడ్ సోకింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు…
ఏ మనిషి జీవితంలో ఎదగాలి అన్నా విద్య అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యను అభ్యసించిన మనిషి పెద్దయ్యాక ఉన్నతంగా ఎదుగుతారు అనడంలో సందేహం అవసరం లేదు. ఇక పాఠశాల విద్యావిధానం మనదేశంలో ఎలా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకు ముందు దేశంలో కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. వివిధ దేశాల్లో వివిధ రాకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింగపూర్: సింగపూర్ లో మూడు రకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. ఆరేళ్లు ప్రైమరి,…