Delhi Car Blast: ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మొహమ్మద్‌కు మరో కారు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన దాడికి హ్యుందాయ్ ఐ20 కారను ఉపయోగించాడు. కారులో పేలుడు పదార్థాలు నింపి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే, అతడికి ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.