కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో..…
కరోనా మహమ్మారి తగ్గడంతో శుభకార్యాలు, పెళ్ళి తంతులు పెరిగిపోయాయి. ఓ పెళ్ళి తంతుకి వెళ్లి భోజనం చేసిన 1200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని మెహసనా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్ళి విందులో ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు జనం. విషయం తెలుసుకున్న అధికారులు ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో విందు భోజనం చేసిన 1200 మందికిపైగా అతిథులు ఆసుపత్రి పాలయ్యారు.…
చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.…