చలికాలం ప్రారంభం కావడంతో పొగమంచు హైదరాబాద్ నగరాన్ని కప్పేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్-హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు సన్ సిటీ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా…