అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హైవేపై కార్లు దూసుకెళ్లిపోతుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళంగా నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Florida Plane Crash: ఫ్లోరిడా నుంచి హృదయ విదారకమైన వార్త ఒకటి వెలువడుతోంది. శుక్రవారం (9 ఫిబ్రవరి 2024) ఒక ప్రైవేట్ విమానం హైవేపై ఘోరంగా కూలిపోయింది. దీంతో ఇద్దరు చనిపోయారు.