అతి వినయం ధూర్త లక్షణం అంటారు పెద్దలు. అంటే అవసరమైన దానికన్నా అధికంగా వినయం చూపేవారి గురించి పెద్దలు ఈ సామెత ఉపయోగిస్తుంటారు. అంతేకాదు.. అతి వినయం దుష్టుల లక్షణం అని కూడా అంటారు.
అన్నదాతా సుఖీభవ.. అన్నదాత విజయీభవ అంటారు పెద్దలు. కర్షకుడు.. ఆరుగాలం కష్టపడి.. పండిస్తే.. ప్రజలకు కడుపునిండా అన్నం దొరుకుతుంది. అందుకే రైతేరాజు అన్నారు. అలాంటి అన్నదాతకు కష్టం వస్తే.. కనికరించే నాథుడే లేకుండా పోయాడు. తనకు న్యాయం చేయండి అంటూ కలెక్టరేట్‌కు వచ్చి పొర్లు దండాలు పెట్టినా.. పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.