ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలు భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురయ్యాయి. భారీగా వర్షాలు పడుతున్న అసోంలో మరో 9 మంది మరణించగా వరదల ధాటికి.. రాష్ట్రం మొత్తం చనిపోయిన వారి సంఖ్య 55కు చేరింది. 28 రాష్ట్రాల్లోని దాదాపు 19 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర, బరాక్ వాటి ఉపనదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. వరదల…