Bomb Treat : షాకింగ్.. షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
- ఇండిగో విమానంకు బాంబు బెదిరింపు కలకలం
- షార్జా–హైదరాబాద్ విమానం అహ్మదాబాద్‌కు మళ్లింపు
- ప్రయాణికుల్ని సురక్షితంగా దింపిన అధికారులు
- ఇండిగోపై ఇది రెండో బాంబు బెదిరింపు కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Treat : షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, విమానాన్ని దాని గమ్యస్థానం హైదరాబాద్‌కు కాకుండా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్ళించారు. అహ్మదాబాద్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అనంతరం భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో కలిసి విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండవసారి. గతంలో, కువైట్ నుండి హైదరాబాద్‌కు రావాల్సిన మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో, ఆ విమానం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు కూడా ప్రయాణికులను దించి, బాంబు డిస్పోజల్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!