అనంతపురం జిల్లా రాజకీయాల్లో తరచూ హైటెన్షన్ ఏర్పడే నియోజకవర్గాల్లో ఉరవకొండ కూడా ఒకటి. అదేదో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వార్‌తోనే కాదు. అధికార వైసీపీలో ఉన్న గ్రూపులతోనే తరచూ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుంటాయి. కానీ ఈసారి సీన్ మారింది. ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య పెద్ద వార్‌కు దారితీసింది. కాకపోతే ఇక్కడ ఫ్లెక్సీలు కట్టింది వైసీపీ నేతలు. ఆ…