Jupiter: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, భారీ వాయుగోళం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ కనిపించింది. ఎప్పుడు చూడని విధంగా ఈ ఫ్లాష్ ఉంది. ఇలాగే గతంలో అంతరిక్ష వస్తువులు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయి. తాజా నమోదైన ఈ వెలుగు, ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ఆగస్టు 28న ఇది రికార్డ్ అయింది.