పేరుకు అభివృద్ధి అని చెబుతున్నా.. అధికారపార్టీని ఇరుకున పెట్టేలా వైరిపక్షాలు అడుగులు వేస్తున్నాయా? భద్రాచలంలో.. ఆ ఐదు గ్రామాల అంశాన్ని మళ్లీ రోడ్డెక్కించడం వెనక వ్యూహం అదేనా? ఢిల్లీ స్థాయిలో కదలిక తేవాల్సిన చోట.. లోకల్ పాలిటిక్స్ వేడి పుట్టిస్తాయా? ఇంతకీ ఆ ఐదు గ్రామాల రగడేంటి? ఐదు గ్రామాల విలీనంపై ఇరుకున పెట్టే రాజకీయాలు! భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్…