వైఎస్‌ఆర్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. సరదా కోసం ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు కావడంతో మల్లెపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి . బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లిలో వేసవి సెలవులు కావడంతో ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని బంధువుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వెతికినా ఆచూకీ తెలియరాలేదు.
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మధ్యాహ్నం ఇంటి నుంచి మున్నేరు వాగు వైపు వెళ్లిన పిల్లలు రాత్రి అయినా తిరిగిరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గల్లంతైన వారిని చరణ్, బాలయేసు, అజయ్, రాకేష్, సన్నీగా పోలీసులు వెల్లడించారు. నది ఒడ్డున విద్యార్థుల బట్టలను వారు స్వాధీనం చేసుకున్నారు. Read Also: పంచెకట్టి వేషం మార్చారు.. ఏసీబీ దెబ్బకు హడల్…