అప్పుడప్పుడు వడగళ్ళవాన పడడం కామన్. కానీ కొన్ని ప్రాంతాల్లో చేపల వాన కురవడం మనం అరుదుగా వింటుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నిజంగానే చేపల వర్షం కురిసింది. సోమవారం వేకువజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెల్లవారు జామున భారీ వర్షం కురవడంతో కాళేశ్వరం పల్గుల బైపాస్ రోడ్డు కాలనీలో విచిత్రం చోటుచేసుకుంది. అక్కడే వున్న కొందరి ఇళ్ళ పరిసరాలలో, అటవీ ప్రాంతంలోని పడిదం చెరువు గుంతలలో చేపలు ప్రత్యక్షం అయ్యాయి. పడిదం చెరువు సమీపంలో ఉపాధి…