సిద్ధిపేట జిల్లా ప్రజలకు రైలు ఎక్కాలనే కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు జర్నీ ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వచించారు. ఇక, సిద్దిపేటలో రైలు కూతపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ దిగి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన.