IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…
మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశ్చర్యకరంగా బుమ్రాను తుది జట్టులోకి తీసుకోకుండా ఉమేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రానున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్…
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. భారత…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఖంగుతింది. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు ఆటగాళ్లు డుస్సెన్ 75 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 64 నాటౌట్ చెలరేగి ఆడారు. ఓపెనర్లు డికాక్ (22), బవుమా (10) విఫలమైనా 10 ఓవర్లలో మూడు వికెట్ల…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషాన్ 76 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్…
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందాయి. టీమిండియా రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్,…
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే తొలి టీ20 జరిగే ఢిల్లీలో రాత్రిపూట కూడా వడగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లోనే ఢిల్లీలో ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది.…
స్వదేశంలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌పై వరుసగా వన్డేలు, టీ20ల సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను కూడా విజయంతోనే ప్రారంభించింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివరకు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 62 పరుగుల…
శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని…