దేశంలో అక్షరాస్యత, ఉత్తమమైన గ్రామ పంచాయతీ వ్యవస్థతో పాటు టెక్నాలజీ, ఇంటర్నెట్ వినియోగంలో ముందు వరసలో ఉంటుంది కేరళ రాష్ట్రం. తాజాగా మరో ఘనత సాధించింది కేరళ. దేశంలో సొంత ఇంటర్నెట్ సేవలు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేరళలో ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడానికి విజయన్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఇంటర్నెట్…