గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని మొధేరాను తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు సూర్యదేవాలయం ఉన్న గ్రామంగా మొధేరా ప్రసిద్ధి చెందిందని.. ఇప్పటి నుంచి సూర్య గ్రామంగా పిలుస్తారని ప్రధాని మోడీ వెల్లడించారు.